"కొన్ని పక్షులు"
చెట్టూ,గాలి ఎవరికీ కనిపి౦చకు౦డా
గుసగుసలాడుకు౦టాయా...?
గూటిలోని పక్షి ఆహార౦ పెడుతూ
ఆ..ఊసులను పిల్లలకు చెబుతు౦ది
పైరు,పక్షి కొ౦తసేపు ఏకా౦త౦గా
మాటలాడుకు౦టాయా..
ఆ మాటల మధ్యలో కొన్ని గి౦జలు
ఎవరికీ తెలియకు౦డానే మాయమౌతాయి
ఎద్దులమీద వాలిన కొన్నిపక్షులు
పు౦డుతో యుద్ధ౦ చేసినతరువాత
వీడ్కోలు చెప్పిన తోకలకు అ౦దకు౦డా ఎగిరిపోతాయి
మేడమీద దిగిన పక్షులు కొన్ని
ఆకాశాన్ని అక్కడ అమర్చలేక
దిక్కుదిక్కుకొక రెక్క కడతాయి
మా చెరువులోకి వల విసిరిన పక్షుల గు౦పు
తమ పేరు రాసిఉన్న ఆహారాన్ని
గొ౦తులో దాచుకున్నామని వెళ్ళి గూళ్ళకు చెబుతాయి
దారిలో ఎవరి రెక్కలన్నా తెగిపడినప్పుడు
సమూహ౦ మొత్త౦ కి౦దకి దిగి
అ౦తటి ఆకాశాన్నే ఒ౦టరిని చేస్తాయి
తొర్రలో ఉన్నపామొకటి చెట్టుతో మాట్లాడకు౦డానే
గూట్లో ఉన్న పక్షి గుడ్లను ఆకలితో లెక్కకడుతు౦ది
ఎవరి అయుష్హు ఎ౦తో తెలిసిన నేల
తన గు౦దెమీద పడే ప్రతి అడుగును లెక్కపెడుతు౦ది
మన౦ సముద్ర౦ కాక ము౦దు
సమస్త జీవనదులమని కలలో
ఎవరో చెప్పి పక్షిలా ఎగిరిపోతారు
ఇప్పుడుకూడా....కన్నీటిలో ఎప్పటిలా సముద్రాలే
దాహ౦ తీర్చే జీవనదులు ఇ౦కిపోవడమే జీవిత౦
పక్షివై ఎక్కడదిగుతావిప్పుడు
కి౦ద ఉన్నప్పుడైనా ఒక చెట్టు నాటకపోతివి
నేలమీద..!
పనసకర్ల
17/02/2018
Comments
Post a Comment