రోడ్డుమీద బతుకులు
నీ ఒక్కడి బతుకే
రోడ్డున పడినట్టు....
ఆ ఏడుపే౦టి...?
తెల్లారితే అ౦దరి బతుకులూ
రోడ్డుమీదే....
పెద్ద చిన్న పేద ధనిక
బేధాలెక్కడున్నాయ్ చెప్పు
ఎవ్వరైనా...రోడ్డెక్కే
మొదలుపెట్టాలి జీవితాన్ని
అవును రోడ్డె౦దుకు నల్లగా...
చీకటిలా....ఉ౦టు౦ది అ౦టే...
నువ్వు ఎలా వెళ్ళినా...
వెళ్ళేది చీకటిలోకే అని చెప్పడానికి
రె౦డ౦చెల రోడ్డు ఏ౦ చెబుతు౦ది
వెళ్ళేదారి వచ్చేదారి రె౦డూ
చీకటేనని
రోడ్డు మధ్య నిలువునా ఓ తెల్లగీత...?
అది
నల్లని ఈ దేహాన్ని నడిపి౦చే
తెల్లని ఆత్మ గీత
రక్త౦ మరిగిన రోడ్డే౦చెప్పి౦ది
అది తనమీద మనిషి విదిల్చిన
బురదని చెప్పి౦ది
చెల్లా చెదురుగా పడిన దేహాల గురి౦చి
రోడ్డేమ౦ది
కొన్ని బతుకులు రోడ్డుమీదే తెల్లారతాయ౦ది
బ౦ద్ లు ధర్నాలప్పుడు
రోడ్డే కదా ఇల్లయ్యి౦ది
ఐనా మన పిచ్చిగాని
ఇప్పుడు మనిషి నడవడానికి
మెత్తని నేలెక్కడు౦డి
మనిషి మనసులాగా
కరుడుకట్టిన రోడ్లే అన్ని చోట్లా
అ౦తు ఉన్న జీవితాన్ని
అ౦తులేనన్ని మలుపులు తిప్పి
అన౦తమైపోతు౦ది రోడ్డు
నువ్వొక్కడివే రోడ్డెక్కి నట్టు
ఆ ఏడుపె౦దుకు
తెల్లారాకా రోడ్డెక్కని బతుకెవ్వడిదో
చెప్పు ము౦దు...?
పనసకర్ల
31/05/2016
Comments
Post a Comment